హైకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం!
- కరోనాపై అంత నిర్లక్ష్యం ఎందుకు?
- మా ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదు?
- అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి?
ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను డబ్బుకోసం పీడిస్తున్నాయని... దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.