హెచ్1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
- వీసాదారులు తమ పాత ఉద్యోగం కొనసాగించేందుకు అనుమతి
- వీసాదారులపై ఆధారపడేవాళ్ల ప్రయాణాలకు అనుమతి
- వారి జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా
- ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు నిర్ణయం
అయితే, ఈ వీసాలపై నిషేధానికి ముందు ఏ ఉద్యోగం చేశారో, అదే ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇస్తూ ట్రంప్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆ వీసాదారులపై ఆధారపడేవాళ్లు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు అగ్రరాజ్యం ప్రయాణం చేసేందుకు అనుమతి కల్పించారు.
కరోనా వ్యాప్తి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ వీసాలతో ఉన్న విదేశీ టెక్నికల్ స్పెషలిస్టులు, సీనియర్ లెవల్ మేనేజర్ల సేవలు ఎంతగానో అవసరముందని అమెరికా పేర్కొంది. కాగా, ఈ వీసాలపై నిషేధం విధించడంతో ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు అమెరికాలోని కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.