డ్యూటీ నుంచి వచ్చి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న స్టాఫ్‌నర్స్
- సికింద్రాబాద్‌లో ఘటన
- బాధితురాలిది నల్గొండ జిల్లా
- నాలుగేళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా విధులు
మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య రాత్రయినా బయటకు రాకపోవడంతో స్నేహితులు అనుమానించారు. దీంతో గదిలోకి చూడగా విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు గదిని పరిశీలించారు. ఆమె పక్కన మత్తు ఇంజక్షన్ పడి ఉండడంతో అది తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.