రాయలసీమ కోసం దక్షిణ తెలంగాణను నాశనం చేస్తారా?: వంశీచంద్‌రెడ్డి
- దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారు
- రాయలసీమ ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణకు తీవ్ర ముప్పు
- కేసీఆర్ కు కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ఎక్కువయ్యాయి
రాయలసీమను రతనాల సీమ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుందని వంశీచంద్ దుయ్యబట్టారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడంపై తమకు అభ్యంతరం లేదని... అయితే, ఇదే సమయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే చర్యలను అంగీకరించబోమని చెప్పారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆరోపించారు.