హర్యాణాలో త్వరలో గాడిద పాల డెయిరీ.. మరి, లీటర్ ధర ఎంతో తెలుసా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హర్యాణాలో త్వరలో గాడిద పాల డెయిరీ.. మరి, లీటర్ ధర ఎంతో తెలుసా?

India to soon get dairy for donkey milk
  • హర్యాణాలోని హిస్సార్ లో ఏర్పాటు కానున్న గాడిద పాల డెయిరీ
  • హలారి గాడదలతో పాల ఉత్పత్తి
  • లీటర్ గాడిద పాలు రూ. 7 వేలు
పాలు, పాల ఉత్పత్తుల కోసం మన దేశంలో ఎన్నో డెయిరీలు ఉన్నాయి. అయితే ఆవు, గేదె డెయిరీల ద్వారానే మనకు పాల సరఫరా జరుగుతోంది. తాజాగా మన దేశంలో గాడిద పాల డెయిరీ ప్రారంభం కాబోతోంది. హర్యాణాలోని హిస్సార్ లో ఉన్న నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ లో ఈ డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఈ గాడిదలు గుజరాత్ లో ఉంటాయి. వీటి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గాడిద పాలు కీలక పాత్రను పోషిస్తాయి. చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా పని చేస్తాయి.

హలారి గాడిదలకు చాలా డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటర్ కు రూ. 7 వేల వరకు ఉంటుంది. అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ గాడిదల పాలు తోడ్పడతాయి. ఈ నేపథ్యంలోనే గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. తొలుత గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని... ఆ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది.

ఈ సందర్భంగా రీసర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ... ఆవు, గేదె పాల ద్వారా చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీల బారిన పడుతుంటారని... కానీ హలారి బ్రీడ్ గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయని తెలిపారు. గతంలో త్రిపాఠి ఆధ్వర్యంలోనే గాడిద పాలపై రీసర్స్ ప్రారంభమైంది.
Donkey
Milk Dairy
Cost

More Telugu News