డీఎంకే నేత కనిమొళికి విమానాశ్రయంలో చేదు అనుభవం
- ఎయిర్ పోర్టులో హిందీలో మాట్లాడిన సీఐఎస్ఎఫ్ అధికారిణి
- తమిళం,లేదా ఇంగ్లీషులో మాట్లాడాలన్న కనిమొళి
- మీరు భారతీయులు కాదా? అంటూ ప్రశ్నించిన అధికారిణి
దీనిపై సీఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందించింది. కనిమొళికి ఎదురైన పరిస్థితిని గుర్తించామని, ఆమె ప్రయాణ వివరాలు, ఎయిర్ పోర్టు పేరు, లొకేషన్, ప్రయాణ తేదీ, సమయం ఇత్యాది వివరాలు పంపిస్తే కారకులపై చర్యలు తీసుకుంటామని సీఐఎస్ఎఫ్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభమైందని, ప్రత్యేకించి ఓ భాష గురించి అడగడం తమ విధానాల్లో భాగం కాదని స్పష్టం చేసింది.