బిగ్ బాస్ నాలుగో సీజన్ షూటింగ్ స్టార్ట్... పిక్స్ పంచుకున్న నాగార్జున!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ నాలుగో సీజన్ షూటింగ్ స్టార్ట్... పిక్స్ పంచుకున్న నాగార్జున!

Bigg boss Shooting Pics Shared by Nagarjuna
  • నేను షూటింగ్ కు వెళుతున్నాను
  • మళ్లీ షూటింగ్ నిజంగా అద్భుతం
  • అన్నపూర్ణా స్టూడియోస్ లో చిత్రీకరణ
  • వెల్లడించిన నాగార్జున
టాలీవుడ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 షూటింగ్ మొదలైపోయింది. తాను షూటింగ్ కు హాజరవుతున్నానని చెబుతూ హోస్ట్ నాగార్జున సెట్ లోని పిక్స్ ను ఫ్యాన్స్ తో  పంచుకున్నారు. "మళ్లీ షూటింగ్ కు వచ్చేశాను. లైట్లు, కెమెరా, యాక్షన్... ఎంత అధ్భుతం... నిజంగా అద్భుతంగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, నాగ్ పంచుకున్న స్టిల్ లో పీపీఈ కిట్స్ ధరించిన మేకప్ మెన్ లు ఆయన్ను రెడీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. షూటింగ్ యావత్తూ అన్నపూర్ణా స్టూడియోస్ లోనే జరుగుతుండగా, ఇప్పటికే హౌస్ సెట్ పూర్తయిపోయింది. ఇక నాగ్ ప్రచార చిత్రానికి 'సోగ్గాడే చిన్నినాయన' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ చిత్రించారు. అతి త్వరలోనే ఈ ప్రచార చిత్రం విడుదల కానుంది. 

ఇదిలావుండగా, గత సీజన్ లలో 100 రోజుల పాటు సీజన్లు సాగగా, కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం దాన్ని 50 రోజులకే పరిమితం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక షోలో కౌగిలింతలు, కరచాలనాలు, దగ్గరకు తీసుకోవడాలు వంటి సీన్లు కనిపించక పోవచ్చని కూడా తెలుస్తోంది. టాస్కులు సైతం పోటీదారులు భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందుకోసం ఫన్నీ టాస్క్ లను తయారు చేసేందుకు ఓ స్పెషల్ టీమ్ పనిచేస్తోందని సమాచారం. మొత్తం మీద ఈ సీజన్ సైతం రక్తి కట్టించేలానే ఉంటుందని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి.
Bigg Boss
Nagarjuna
Shooting
Pics

More Telugu News