సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పూజ హెగ్డే అలవాటు చేసుకున్న ఫిలాసఫీ
- తనయుడి కోసం కథలు వింటున్న బాలకృష్ణ
- రజనీకాంత్ షూటింగ్ ఆరు నెలల వాయిదా
* నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం అతనికి సూట్ అయ్యే కథ కోసం బాలకృష్ణ చూస్తున్నారట. ఈ క్రమంలో పలువురు దర్శకులు చెప్పే కథలు వింటున్నారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
* రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి చెన్నైలో జరుగుతుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రజనీకాంత్ సూచన మేరకు మరో ఆరు నెలల వరకు షూటింగును వాయిదావేసినట్టు తాజా సమాచారం.