అరగంట పాత్ర కోసం కాజల్ కు భారీ పారితోషికం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరగంట పాత్ర కోసం కాజల్ కు భారీ పారితోషికం!

Kajal charges a bomb for a guest role
  • 'హాథీ మేరీ సాథీ'లో కాజల్ గెస్ట్ పాత్ర 
  • 70  లక్షలు తీసుకున్న ముద్దుగుమ్మ
  • ఆదివాసీ యువతి పాత్రలో కాజల్
హీరోయిన్లకు పారితోషికం వద్ద మొహమాటాలు వుండవు. తమ కెరీర్ స్పాన్ తక్కువగా వుంటుంది కాబట్టి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటారు. అందుకే, హీరోయిన్ వేషమైనా, ఐటం సాంగ్ అయినా, గెస్ట్ రోల్ అయినా తమ డిమాండును బట్టి నిర్మాత నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. తాజాగా అందాలభామ కాజల్ అగర్వాల్ కూడా అలాగే ఓ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినందుకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిందట.

రానా కథానాయకుడుగా హిందీలో రూపొందుతున్న 'హాథీ మేరీ సాథీ' చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇందులో ఆమె పాత్ర నిడివి అరగంట సేపు మాత్రమే ఉంటుందట. ఇందుకు గాను ఆమె సుమారు 70 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె ఆదివాసీ యువతిగా కనిపిస్తుంది. దీంతో వాళ్ల సంప్రదాయాల ప్రకారం బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే అమ్మడు కనిపిస్తుందట.
Kajal Agarwal
Rana
Hathi Meree Sathi

More Telugu News