Corona Virus: దేశంలో మరింత పెరిగిన కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 62 వేలకు పైగా కేసులు

coronavirus cases in india
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది.  
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 20,27,075కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 41,585కి పెరిగింది. 6,07,384  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు.
                                                                             
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,27,24,134  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,74,783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News