ప్లే స్టేషన్ కావాలని అడిగిన నెటిజన్ కు సోనూ సూద్ ఆసక్తికర సమాధానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్లే స్టేషన్ కావాలని అడిగిన నెటిజన్ కు సోనూ సూద్ ఆసక్తికర సమాధానం!

Twitter user wants Sonu Sood a Play Station
  • మానవతకు ప్రతిరూపంలా నిలుస్తున్న సోనూ
  • కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం
  • వీడియో గేములు ఆడుకుంటానన్న నెటిజన్
  • హాయిగా పుస్తకాలు చదువుకోవాలని సలహా
కరోనా కష్టకాలంలో ఆపద్బాంధవుడు అనే పదానికి ప్రతిరూపంలా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు సోషల్ మీడియాలో చిత్రమైన అభ్యర్థనలు ఎదురవుతున్నాయి. అడగకుండానే సాయం చేస్తున్న ఈ కండలరాయుడ్ని నీలేశ్ నింబోరే అనే నెటిజన్ విచిత్రమైన కోరిక కోరాడు. తనకు వీడియో గేములు ఆడుకునేందుకు వీలుగా ప్లే స్టేషన్-4 గేమింగ్ కన్సోల్ కొనివ్వాలని విజ్ఞప్తి చేశాడు.

చుట్టూ ఉన్నవాళ్లంతా ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుతుంటే తాను చూస్తూ ఉండిపోతున్నానని, తనకు కూడా ఒక గేమింగ్ కన్సోల్ కొనివ్వాలని ట్విట్టర్ ద్వారా కోరాడు. అందుకు సోనూ సూద్ స్పందిస్తూ... "నీ దగ్గర ప్లే స్టేషన్-4 లేకపోతే నిజంగా నువ్వు అదృష్టవంతుడివే. హాయిగా కొన్ని పుస్తకాలు తెచ్చుకుని చదువుకో. పుస్తకాలకు సాయం చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తా" అని బదులిచ్చారు.

Play Station-4
TwitterUser
Sonu Sood
Books
Corona Virus

More Telugu News