Corona Virus: దేశంలో ఒక్కరోజులో 56,282 మందికి కొత్తగా కరోనా

India reports single day spike of 56282 new cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 56,282 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 904 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,64,537కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 40,699కి పెరిగింది. 5,95,501 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,28,337 మంది కోలుకున్నారు.
                                                                       
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,21,49,351 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,64,949 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News