దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం!
- అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన సోలిపేట
- మృతితో టీఆర్ఎస్ నేతల దిగ్భ్రాంతి
- నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి
ఆయన స్వస్థలం చిట్టాపూర్ గ్రామం కాగా, ఆయనకు భార్య సుజాత, కుమారుడు సతీశ్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004లో తొలిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, 2008 ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆపై 2009లో ఓటమి పాలైనా, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. జర్నలిస్టు నాయకునిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన, కొంతకాలం నక్సలైట్ ఉద్యమంలోనూ పనిచేశారు. సోలిపేట మృతిపై టీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.