కొడుకును చూసి మురిసిపోయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా... ఆసుపత్రిలోనే పార్టీ!

Hardhik Pandya Happy Moments
  • గుజరాత్ లోని ఆనంద్ పట్టణంలో నటాషాకు ప్రసవం 
  • డాక్టర్ల బృందానికి హార్దిక్ దంపతుల కృతజ్ఞతలు
  • కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న హార్దిక్
తన జీవితంలోకి అడుగుపెట్టిన చిన్నారికి ఘన స్వాగతం పలుకుతూ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా ఆసుపత్రిలోనే వైద్యులకు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కొడుకును చేతుల్లోకి తీసుకుని మురిసిపోయిన హార్దిక్, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. తన కుటుంబంలోని కొత్త సభ్యుడిని ప్రపంచంలోకి తీసుకుని వచ్చిన వైద్య బృందానికి హార్దిక్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ల సమక్షంలో కేక్ ను కట్ చేసి, తమలోని ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట, ఈ సంవత్సరం జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తొలుత వార్తలు వచ్చినట్టుగా నటాషా ప్రసవం ముంబైలో జరుగలేదు. గుజరాత్, ఆనంద్ పట్టణంలోని ఆకాంక్ష హాస్పిటల్ లో జరిగింది. 
Go Back to Shorts
Hardhik Pandya
Natasha
Delivery

More Telugu News