డర్టీ పాలిటిక్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో చూడండి: థాకరేలపై కంగనా రనౌత్ ఫైర్

  • సుశాంత్ మరణం తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్న కంగనా
  • తాజాగా ఉద్ధవ్ థాకరేను టార్గెట్ చేస్తున్న సినీనటి
  • ఉద్ధవ్ కు ఏడు ప్రశ్నలను సంధించిన కంగనా
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సినీనటి కంగనా రనౌత్ తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేను టార్గెట్ చేస్తోంది. 'మీ తండ్రి ఉద్ధవ్ థాకరే సీఎం కావడమే డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ సార్' అని ట్వీట్ చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మీ తండ్రిని అడగండి అని కొన్ని ప్రశ్నలను సంధించింది.

  • హీరోయిన్ రియా ఎక్కడుంది?
  • సుశాంత్ అసహజ మరణంపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?
  • సుశాంత్ జీవితానికి ముప్పు ఉందని ఫిబ్రవరిలోనే ఫిర్యాదు అందినప్పటికీ... ఆయన చనిపోయిన తొలిరోజే ఆత్మహత్య అని పోలీసులు ఎలా చెపుతారు?
  • సుశాంత్ చనిపోయిన చివరి రోజుల్లో అతని ఫోన్ డేటా ఎందుకు అందుబాటులో లేదు?
  • క్వారంటైన్ పేరుతో ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ఎందుకు లాక్ చేశారు?
  • సీబీఐ గురించి ఎందుకు భయపడుతున్నారు?
  • సుశాంత్ డబ్బును రియా, ఆమె ఫ్యామిలీ ఎందుకు దోచుకున్నారు?

Kangana Ranaut
Bollywood
Aditya Thackarey

More Telugu News