Corona Virus: దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

Indias COVID19 tally crosses 19 lakh mark
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,509 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 857 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,08,255కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 39,795కి పెరిగింది. 5,86,244 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,82,216 మంది కోలుకున్నారు.
                                                                       
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,14,84,402 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,19,652 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News