ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న వివో... తాజా పరిణామాలతో అసంతృప్తి!
- ఇటీవల సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ
- చైనా సంస్థ వివోపైనా భారత్ లో వ్యతిరేకత
- 2022 వరకు ఐపీఎల్ తో వివో సంస్థకు ఒప్పందం
2018లో వివో సంస్థ ఐపీఎల్ కోసం బీసీసీఐతో రూ.2199 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లపాటు స్పాన్సర్ షిప్ హక్కులు ఉంటాయి. బీసీసీఐ నిన్న కూడా ఓ ప్రకటన చేస్తూ.... తమ స్పాన్సర్లందరూ తమతోనే ఉంటారని స్పష్టం చేసింది. ఎవరినీ తొలగించబోమని పేర్కొంది. కానీ, వివో సామాజిక మాధ్యమాల్లో తమపై వ్యతిరేకత వస్తున్నందున స్వచ్ఛందంగా తప్పుకుంది.