ఐపీఎల్ కు చైనా స్పాన్సర్... ఇప్పుడు తొలగించలేమన్న బీసీసీఐ!
- సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో చైనాపై వ్యతిరేకత
- చైనా సంస్థ వివోను తప్పించాలంటూ డిమాండ్లు
- మరో రెండేళ్లు కాంట్రాక్టు ఉందన్న బీసీసీఐ
వివో సంస్థతో ఐపీఎల్ కు మరో రెండేళ్లపాటు కాంట్రాక్టు ఉందని, ఇప్పుడు స్పాన్సర్ షిప్ నుంచి తొలగించలేమని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది ఉన్న స్పాన్సర్లందరూ ఈ సీజన్ కు కూడా కొనసాగుతారని తన ఉద్దేశాలను బోర్డు తేటతెల్లం చేసింది. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివోతో ఐపీఎల్ కు ఐదేళ్ల కాంట్రాక్టు ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2022లో ముగియనుంది.