ట్వీట్లు చేస్తూ కూర్చుంటే కష్టం.. రాహుల్పై దిగ్విజయ్ సునిశిత విమర్శలు
- పార్లమెంటులో మరింత చురుగ్గా ఉండాలి
- అధ్యక్ష పదవికి న్యాయం చేయాలంటే ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి
- దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విప్ మాణిక్యం మండిపాటు
దిగ్విజయ్ వ్యాఖ్యలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలను పలువురు నేతలు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఇప్పటికే 100కుపైగా పాదయాత్రలు నిర్వహించారని, లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగోర్ అన్నారు. పార్టీలో ఉన్నత పదవిని అలంకరించబోయే వ్యక్తికి వీలైతే మద్దతుగా నిలబడాలని, అంతేతప్ప ఇలా వెనక నుంచి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. తాము ఎల్లకాలం ప్రతిపక్షంలోనే ఉండబోమని మాణిక్యం స్పష్టం చేశారు.