ఏపీలో కొత్తగా 8,555 కరోనా కేసులు... 6,272 మంది డిశ్చార్జి

AP witnessed thousands of new cases and tens of corona deaths
  • రాష్ట్రంలో మరో 67 మంది మృతి
  • 1,474కి చేరిన కరోనా మరణాల సంఖ్య
  • ఏపీలో 1.5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా విశాఖపట్నంలో 1,227 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. అటు, మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. మరో 67 మంది కరోనాతో మృతి చెందారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,474కి పెరిగింది. ఇక, కరోనా నుంచి కోలుకున్న 6,272 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 74,404 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Deaths
Positive Cases
COVID-19

More Telugu News