shekar kammula: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం.

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89)  ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు పైబడటంతో గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.  కమ్ముల శేషయ్య  మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప‌లువు‌రు సినీ ప్ర‌ముఖుల శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఫోన్ ద్వారా ప‌రామ‌ర్శించారు.
shekar kammula
Tollywood

More Telugu News