నూతన విద్యావిధానాన్ని జనసేన స్వాగతిస్తోంది: పవన్ కల్యాణ్
- మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన
- నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసిన కేంద్రం
- మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జనసేన
అయితే, జనసేన ఇంగ్లీషు మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్నది తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేయాలని, ఇంగ్లీషు మీడియం ఓ ఆప్షన్ గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయం అని పవన్ స్పష్టం చేశారు.
తాజాగా, ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నిర్ణయించిన కమిటీ సభ్యులకు, కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.