భార్యను చంపేసి.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన భర్త!
- పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో వరలక్ష్మి అనే వివాహిత హత్య
- గొంతు కోసి దారుణంగా హతమార్చిన భర్త
- వరలక్ష్మి మృతదేహం ఉస్మానియా మార్చురీకి తరలింపు
కొన్ని సందర్భాల్లో ఆమె భయపడి స్నేహితుల ఇళ్లలో దాక్కునేదని చెప్పారు. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరలక్ష్మి గొంతును కత్తితో కోసి, ఇంటి బయట నుంచి తాళం వేసి పారిపోయాడని చెపుతున్నారు. ఈ సందర్భంగా పహాడీ షరీఫ్ ఎస్సై కుమారస్వామి మాట్లాడుతూ, వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు వరలక్ష్మి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.