తన ట్వీట్ పట్ల భారతీయులకు క్షమాపణలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు
- ప్రధాని నెతన్యాహుపై అవినీతి ఆరోపణలు
- దుర్గామాత ముఖాన్ని పోస్టు చేసిన కుమారుడు
- భారత్ నుంచి విమర్శలు
"ఇజ్రాయెల్ రాజకీయ నేతలను ఉద్దేశించి ఓ సెటైరికల్ పేజీలో మీమ్ పోస్ట్ చేశాను. ఆ మీమ్ లో ఉన్నది భారతీయుల దేవత అని, ఎంతోమందికి ఆమె ఆరాధ్య దేవత అని తెలుసుకోలేకపోయాను. కానీ భారత మిత్రుల నుంచి వచ్చిన సందేశాలతో నిజం తెలుసుకున్నాను. వెంటనే ఆ ట్వీట్ తొలగించాను. నన్ను క్షమించండి" అంటూ వినమ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలు రాగా, వాటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. విపక్షాలు నెతన్యాహుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాయిర్ దుర్గామాత ట్వీట్ చేశారు.