నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్... వర్మకు జరిమానా వడ్డించిన జీహెచ్ఎంసీ
- ఇటీవలే పవర్ స్టార్ సినిమా రూపొందించిన వర్మ
- లాక్ డౌన్ లో తొలి పోస్టర్ తనదేనంటూ ట్వీట్
- ట్వీట్ ఆధారంగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి
లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ వర్మ నిబంధనలు అతిక్రమించాడని గుర్తించి 4 వేల రూపాయలు జరిమానాగా విధించింది. ఈ మేరకు చలానా జారీ చేసింది.