పూజలు చేశాను, కరోనా పోతుందని చెప్పి.. పీఠానికి తాళం వేసుకున్నారు: స్వరూపానందస్వామిపై వాసుపల్లి విమర్శలు
- స్వరూపానంద కనిపించడం లేదు
- కరోనా పెరగడానికి మద్యం అమ్మకాలు కూడా కారణం
- మద్యం షాపులను మూసేయాలి
కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల నష్ట పరిహారం అందించాలని ఈ సందర్భంగా వాసుపల్లి గణేశ్ డిమాండ్ చేశారు. మందు కోసం క్యూలైన్లలో నిలబడాల్సి రావడం దారుణమని అన్నారు. మందుబాబుల వల్ల కుటుంబసభ్యులు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మద్యం అమ్మకాలు అవసరమా? అని ప్రశ్నించారు. మద్యం షాపులను మూసేయాలని డిమాండ్ చేశారు.