మరో చిత్రానికి ఓకే చెప్పిన అనుష్క!

Anushka gives nod for a Tamil movie
  • 'బాహుబలి' తర్వాత తగ్గిన అనుష్క క్రేజ్ 
  • థియేటర్ల మూసివేతతో విడుదల కాని 'నిశ్శబ్దం'
  • విజయ్ సేతుపతి చిత్రానికి గ్రీన్ సిగ్నల్  
ఒకప్పుడు నెంబర్ వన్ కథానాయికగా పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కనిపించిన అనుష్క, ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్ల రాకతో వెనుకపడింది. 'బాహుబలి' తర్వాత ఆమె చేసిన చిత్రాలు ఏమాత్రం ఆడకపోవడంతో ఆమె క్రేజ్ బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన 'నిశ్శబ్దం' చిత్రం పూర్తయినా కూడా, థియేటర్లు మూతబడడం కారణంగా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

దీంతో ఆమె ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతుందంటూ ఈమధ్య వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అనుష్క తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె కథానాయికగా నటించనుందని అంటున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో అనుష్క రెండు సినిమాలు చేసింది. ఆ పరిచయం కారణంగానే ఈ చిత్రానికి ఆమె ఓకే చెప్పిందని సమాచారం.  
Go Back to Shorts
Anushka Shetty
Bahubali
Vijay Setupati

More Telugu News