60 మంది ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా: పైలట్ల సంఘం
- వందేభారత్ మిషన్‌లో సేవలు అందించిన పైలట్లకు కరోనా
- విమానయాన మంత్రికి లేఖ రాసిన సంఘం
- విపత్కర సమయంలో సేవలు అందిస్తున్న తమకు వేతనాల్లో కోత సరికాదని ఆవేదన
మొత్తం 137 దేశాల నుంచి 5,05,990 మందిని వెనక్కి తీసుకొచ్చినట్టు ఆ లేఖలో పేర్కొన్న సంఘం.. ఈ కష్టకాలంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరింది. మహమ్మారిని లెక్కచేయకుండా విధుల్లో పాల్గొంటున్న తమ పైలట్ల వేతనాల్లో కోతలు సరికాదని, దీనివల్ల పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.