అయోధ్య రామాలయం డిజైన్, నిర్మాణానికి పట్టే కాలం.. వివరాలు!
- పాత డిజైన్ తో పోలిస్తే 20 అడుగులు పెరిగిన ఆలయం ఎత్తు
- కొత్త డిజైన్ లో చేరిన రెండు మండపాలు
- మూడు లేదా మూడున్నర ఏళ్లలో పూర్తికానున్న నిర్మాణం
వాస్తవానికి 1988లో తయారు చేసిన డిజైన్ లో ఆలయం ఎత్తు 141 అడుగులుగా ఉంది. దీంతో, తాజాగా ఆలయం ఎత్తును మరో 20 అడుగులు పెంచినట్టు తెలుస్తోంది. కొత్త డిజైన్ లో రెండు మండపాలను కూడా చేర్చామని నిఖిల్ తెలిపారు. గత డిజైన్ ఆధారంగా చెక్కిన పిల్లర్లు, ఇతర రాతి ఫలకాలను ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తామని చెప్పారు.
ఇక ఆలయ నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రధాని మోదీ సమక్షంలో భూమిపూజ జరిగిన వెంటనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కావాల్సిన మెటీరియల్, మెషినరీతో చేరుకుందని తెలిపారు.