మేము చివాట్లు పెడుతుంటే అభినందించామని చెపుతారా?: తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
- తక్కువ టెస్టులు చేస్తున్నారు
- మా ఆదేశాలను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
- కరోనా బులెటిన్ లో వాస్తవాలను దాస్తున్నారు
కరోనా బులెటిన్, ఆసుపత్రుల్లోని బెడ్ల సంఖ్యపై అధికారులు కావాలనే వాస్తవాలను దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి విషయంలో హైకోర్టు అభినందించిందని బులెటిన్ లో పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంటే... అభినందించినట్టు చెపుతూ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించింది.