Corona Virus: దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 40 వేలకు పైగా కేసులు

India reports more than 40000 new Coronavirus cases in a single day
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 40,425 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 681 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 11,18,043కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 27,497కి పెరిగింది. 3,90,459 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,00,087 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,40,47,908 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,56,039 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News