Corona Virus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. గత 24 గంటల్లో 606 మంది మృతి

Highest single day spike of 32695 COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 32,695 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 606 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,68,876కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,915కి పెరిగింది. 3,31,146 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,12,815 మంది కోలుకున్నారు.
                                                                                       
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,27,39,490 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,26,826 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News