కారుపై ఎమ్మెల్యే స్టిక్కరు.. అందులో రూ.5.27 కోట్లు.. ఒంగోలుకు చెందిన ముగ్గురి అరెస్ట్
- ఏపీ నుంచి చెన్నైకి గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం
- ఎలావూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము
- కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో అనుమానాలు
మొత్తం 5.27 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. అలాగే, కారులో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్, వసంత్, కారు డ్రైవర్ సత్యనారాయణను అరెస్ట్ చేశారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోయంబత్తూరు సెంట్రల్ ఆర్టీవీ పరిధిలోని వి.రామచంద్రన్ అనే వ్యక్తి పేరిట కారు రిజిస్టర్ అయినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.