బీజేపీ ఎంపీ అరవింద్ పై కోడిగుడ్లతో దాడిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు
- సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ అరవింద్
- బీజేపీ ఆఫీసును ముట్టడించిన టీఆర్ఎస్ శ్రేణులు
- పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు
అంతకుముందు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతికి అప్పగించాడంటూ పరోక్షంగా ఎంఐఎం నేతలపై వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదీద్దున్ ఒవైసీని జిన్నాతో పోల్చడమేంటని నిలదీశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి కేసీఆర్ పెద్ద కొడుకు ఒవైసీ అని పేర్కొన్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ అరవింద్ మండిపడ్డారు.