14 నుంచి బెంగళూరులో పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం!
- బెంగళూరులో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
- ఈ నెల 14 నుంచి 23 వరకు పూర్తి లాక్ డౌన్
- అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి
ఈ నెల 14వ తేదీ నుంచి 23 వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 14వ తేదీ రాత్రి 8 గంటలకు లాక్ డౌన్ మొదలవుతుందని... 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించింది.