సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక వాట్సాప్‌లో సమన్లు!
- కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులు
- సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం
- ఇకపై సమన్లు నోటీసులను ఈ-మెయిల్, వాట్సాప్, ఫ్యాక్స్ చేయొచ్చన్న ధర్మాసనం
అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ క్రమంలో ఇకపై కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ వంటి వాటి ద్వారా పంపించ వచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి ఈ మేరకు నిర్ణయించింది.