హైదరాబాద్ నగర రోడ్లకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసిన మంత్రి కేటీఆర్
- నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించండి
- నిర్మించాల్సిన, విస్తరించాల్సిన రోడ్లను గుర్తించండి
- 100 ఫీట్ల రోడ్లకు ఇరువైపులా చెట్లను పెంచాలి
మరోవైపు, యూఎస్ ఐబీసీ ఇన్వెస్ట్ మెంట్ వెబినార్ లో కూడా ఈరోజు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ కంపెనీల అధినేతలతో ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభ సమయంలో కూడా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటోందని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ కు బలమైన వ్యవస్థ ఉందని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాలు హైదరాబాద్ కంపెనీల ఔషధాలపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.