గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే భార్య, కుమారుడు అరెస్ట్!

Gangster Vikas Dubey wife and son arrested
  • మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో దూబే అరెస్ట్
  • యూపీ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించిన ఎంపీ పోలీసులు
  • ప్రత్యేక వాహనంలో కాన్పూర్ కు తరలిస్తున్న యూపీ పోలీసులు
ఒక డీజీపీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లను పొట్టనపెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి  తెలిసిందే. తాజాగా లక్నోలోని కృష్ణానగర్ లో దూబే భార్య, కుమారుడు, ఇద్దరు నౌకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో దూబే భార్య, కుమారుడి పాత్ర కూడా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, దూబే భార్య సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది. ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలు అని కూడా సమాచారం.

మరోవైపు దూబేను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్ మందిర్ లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడిని మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించారు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ విధించడంతో ప్రత్యేక వాహనంలో కాన్పూర్ కు తరలిస్తున్నారు.
Go Back to Shorts
Vikas Dubey
Wife
Son
Arrest

More Telugu News