రఘురామకృష్ణరాజుపై భీమవరం పోలీసులకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు
- నాతో పాటు సహచర ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
- మమ్మల్ని రఘురామకృష్ణరాజు 'పందులు' అని అన్నారు
- నా పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారు
- రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలి
తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు 'పందులు' అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. అలాగే, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రఘురామకృష్ణరాజు తీరు ఉందని ఆరోపించారు.