గుంటూరు రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడి తరలింపు
- విజయవాడ్ సబ్ జైలు నుంచి గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు
- ఈఎస్ఐ స్కాంలో రిమాండ్ లో ఉన్న అచ్చెన్న
- అచ్చెన్న పిటిషన్ పై అనుకూల తీర్పు ఇచ్చిన హైకోర్టు
అయితే అప్పటికే ఆయనకు శస్త్రచికిత్స జరగడంతో ఆ గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఏసీబీ అధికారులు సైతం అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే విచారించారు. అపై ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తాను ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అచ్చెన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది.