వెబ్ సైట్ లో ఛాతీ ఎక్స్ రే అప్ లోడ్ చేస్తే కరోనా ఉందో లేదో తెలిసిపోతుందంటున్న ఐఐటీ నిపుణుడు
- ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలో గాంధీనగర్ ఐఐటీ పరిశోధన
- ప్రత్యేక సాఫ్ట్ వేర్ కు కృత్రిమ మేధను జోడించిన నిపుణులు
- ఈ సేవలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని వెల్లడి
కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ సాఫ్ట్ వేర్... ఛాతీ ఎక్స్ రేలను పరిశీలించి కరోనా ఉందో లేదో గుర్తిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను పొందుపరిచి కృష్ణప్రసాద్ బృందం ఓ వెబ్ సైట్ (http://covidxray.iitgn.ac.in) రూపొందించింది. ఈ వెబ్ సైట్ లో ఛాతీ ఎక్స్ రేని అప్ లోడ్ చేస్తే చాలు... దీంట్లో సాఫ్ట్ వేర్ కృత్రిమ మేధ సాయంతో ఆ ఎక్స్ రేని విశ్లేషించి కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తిస్తుంది.
ఈ వెబ్ సైట్ సేవలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రాథమికంగా కరోనా సోకిందా లేదా అనేదానిపై ఓ నిర్ధారణకు రావొచ్చని వివరించారు. ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.