రూ. 500 కోట్లు.. అత్యాధునిక హంగులు.. తెలంగాణ నూతన సచివాలయం రూపుదిద్దుకోబోతోందిలా..!
- 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. ఆరు అంతస్తులు
- ఒకేసారి 800 కార్లు పట్టేలా.. రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు
- ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో నిర్మాణం
మొత్తం 27 ఎకరాలున్న ఈ స్థలంలో 20 శాతాన్ని మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగిస్తుండగా, మిగిలిన ప్రదేశంలో ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెయిన్లు నిర్మిస్తారు. అలాగే, ఒకేసారి 800 కార్లు పార్కు చేసుకునేలా, ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెలాఖరులో పనులు ప్రారంభం కానున్నాయి.
రాజప్రాసాదంలా ఆకట్టుకునేలా ఉన్న భవన నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ డిజైన్ చేశారు. మొత్తం పది నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరికి దీనికి ఓకే చెప్పారు. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో దీనిని డిజైన్ చేశారు.