ప్రధాని నామినేషన్ కు ఆమోదముద్ర
రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ అందులో వయసును తప్పుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, నేడు ఆయన నామినేషన్ పత్రాల్లో తన వయసును సవరించారు. దీంతో, ప్రధాని నామినేషన్ కు అసోం ఎన్నికల అధికారి ఆమోదముద్ర వేశారు. కొన్నేళ్ళుగా మన్మోహన్ అసోం నుంచి రాజ్యసభ కు ఎన్నికవుతున్నారు. ఈ ఎన్నికలు మే 30 న జరగనున్నాయి. మే 23 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ.