కరోనా చికిత్సపై ఫిర్యాదులు.. ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సమీక్ష
- నిన్న నెటిజన్లతో సమీక్ష నిర్వహించిన గవర్నర్
- ఆసుపత్రుల్లో సరైన వైద్య సాయం అందడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు
- పలు అంశాలపై ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చిస్తున్న తమిళిసై
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా పరీక్షలు, చికిత్స, పేషెంట్ల బెడ్లు, ట్రీట్మెంట్ బిల్లులు, ప్రజలు తెలిపిన ఫిర్యాదులు తదితర అంశాలపై వారితో చర్చిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. గవర్నర్ తో భేటీ అయిన వారిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కిమ్స్, కేర్ ఆసుపత్రి, అపోలో, విరించి, కామినేని, సన్ షైన్, గ్లోబల్, మల్లారెడ్డి నారాయణ, యశోద, కాంటినెంటల్ ఆసుపత్రుల ప్రతినిధులు ఉన్నారు.


.