రెమ్‌డిసివిర్ తయారీకి మైలాన్‌కు గ్రీన్ సిగ్నల్.. 100 ఎంజీ ఇంజక్షన్ ధర రూ.4,800
- తయారీ, అమ్మకాలకు డీసీజీఐ నుంచి అనుమతి
- డ్రెసెమ్ బ్రాండ్‌తో వస్తున్న ఔషధం
- ఈ నెలలోనే అందుబాటులోకి
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ధరకే రెమ్‌డిసివిర్‌ను అందించనున్నట్టు పేర్కొంది. కాగా, ఈ ఔషధ తయారీకి సిప్లా, హెటిరోలు ఇప్పటికే అనుమతి పొందాయి. పేద, మధ్యతరగతి ఆదాయ వ్యవస్థలు కలిగిన 127 దేశాల్లో రెమ్‌డిసివిర్ ఔషధాన్ని తయారు చేసి విక్రయించనున్నట్టు మైలాన్ తెలిపింది. ఇందుకు సంబంధించి గిలీడ్ సైన్సెస్ కంపెనీ నుంచి లైసెన్స్ పొందినట్టు ఆ సంస్థ అధ్యక్షుడు రాజీవ్ మాలిక్ తెలిపారు. ఔషధ విక్రయానికి మాత్రం భారత్‌లోనే తొలి అనుమతి లభించిందని పేర్కొన్నారు.