జోష్ ఆకాశాన్ని అంటింది సర్: మోదీపై పవన్ వ్యాఖ్యలు
- మోదీ లడఖ్ పర్యటనపై పవన్ ప్రశంసల జల్లు
- నాయకత్వం అంటే ప్రజల్లో స్ఫూర్తిని రగిలించడమేనన్న పవన్
- ఇది అభివృద్ధి యుగం అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యలు
"దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించడమే సిసలైన నాయకత్వం అనిపించుకుంటుంది. మన సాయుధ బలగాల తెగువకు ప్రధాని నరేంద్ర మోదీ నీరాజనాలు అర్పించారు. వారితో ముచ్చటించారు. మోదీ రాక మన బలగాల్లో కచ్చితంగా ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. మీ పర్యటనతో జోష్ ఆకాశాన్ని అంటింది సర్!" అంటూ పవన్ ట్వీట్ చేశారు.
"ఇది అభివృద్ధి యుగం. విస్తరణవాదం ఇప్పుడు పనిచేయదు. శాంతికి కట్టుబడి ఉండాలన్న భారత్ వైఖరి బలహీనత ఎంతమాత్రం కాదు. మన శాంతిని, అభివృద్ధిని చెదరగొట్టాలని చూసేవారికి మనం దీటైన సమాధానం ఇవ్వాలి" అంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.