వర్మ నుంచి మరో హారర్ చిత్రం '12 ఓ క్లాక్'
- లాక్ డౌన్ లో వరుసగా సినిమాలు చేస్తున్న వర్మ
- ఇప్పటికే 'క్లైమాక్స్', 'నేకేడ్' చిత్రాల విడుదల
- 'పే ఫర్ వ్యూ' విధానంలో రిలీజ్
- తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తున్న వర్మ
ఈ క్రమంలో వర్మ మరో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీని పేరు '12 ఓ క్లాక్' (12 O' CLOCK). ఇది తన నుంచి వస్తున్న మరో హారర్ చిత్రమని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదేమీ లఘు చిత్రం కాదనీ, ఒక గంట 45 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుందని ఆయన చెప్పారు. ఈ రాత్రి ఏడు గంటలకు దీని ట్రైలర్ ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక సినిమా కూడా త్వరలోనే విడుదల అవుతుందని తెలుస్తోంది. కాగా, వర్మ గతంలో 'రాత్', 'భూత్' వంటి హారర్ చిత్రాలను రూపొందించిన సంగతి విదితమే.