ఇక ఇంటెల్ వంతు...రిలయన్స్ జియోలో 12వ పెట్టుబడిగా రూ. 1,894.50 కోట్లు!
- 11 వారాల వ్యవధిలో 12 పెట్టుబడులు
- 0.39 శాతం వాటా కొన్న ఇంటెల్
- జియో విశ్వవ్యాప్తమైందన్న రిలయన్స్
మొత్తం 11 వారాల వ్యవధిలో జియో ప్లాట్ ఫామ్స్ విశ్వవ్యాప్తమైందని, భారత్ లో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పిందని ఈ సందర్భంగా రిలయన్స్ వ్యాఖ్యానించింది. ప్రపంచ విపణిలో ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పెట్టుబడులను స్వీకరించిన ఏకైక సంస్థ రిలయన్స్ కావడం గమనార్హం. అదికూడా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ జియోకు భారీ ఎత్తున పెట్టుబడులు రావడం విశేషం.