కరోనాపై నా దేశ పోరాటం అద్వితీయం: కిమ్ జాంగ్ ఉన్
- కరోనా ఉత్తర కొరియాను ఏమీ చేయలేకపోయింది
- వేలాది మంది ఐసొలేషన్ వెనుక జాతి భద్రతే కారణం
- పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ జాంగ్ ఉన్
వేలాది మందిని ఐసోలేషన్ లో ఉంచడం వెనుక జాతి భద్రత తమ దృష్టిలో ఉందని వ్యాఖ్యానించిన ఆయన, పార్టీ జనరల్ కమిటీ తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలతోనే కరోనాను జయించామని అన్నారు. జాతి యావత్తూ, స్వచ్చందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను ఆయన అభినందించారని కేసీఎన్ఏ పేర్కొంది. ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారలేదని, గరిష్ఠ అప్రమత్తత అవసరమని కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారని పేర్కొంది.