'నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డే' అంటూ గొంతుకోసుకున్న వ్యక్తి
- ఓడీసీఎంఎస్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నెక్కొండ మండల వాసి
- లాక్‌డౌన్ కారణంగా విధుల నుంచి తొలగించిన వైనం
- ఎమ్మెల్యేను కలిసి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్న వైనం
నిన్న కూడా ఎమ్మెల్యేను తన నివాసంలో కలిసి ఇదే విషయమై అభ్యర్థించాడు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని చాకుతో గొంతు కోసుకున్నాడు. ఈ సందర్భంగా తన చావుకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డే కారణమని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్‌ను అభ్యర్థిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఎమ్మెల్యే పెద్ది.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని పేర్కొన్నారు.